Monday, January 20, 2025

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లింగ్ క్రీడాకారులకు శ్రీనివాస్ గౌడ్ సంఘీభావం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లింగ్ క్రీడాకారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంఘీభావం తెలిపారు. ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరత్ సింగ్, మహిళా రెజ్లింగ్ క్రీడాకారులను మానిసికంగా, శారీరకంగా, లైంగికంగా వేదించారని ఏడుగురు మహిళ రెజ్లింగ్ క్రీడాకారులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు.

వారి ఆందోళనకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూర్తి మద్దతు ప్రకటించారు. మంత్రి వెంట ఎంపి నామా నాగేశ్వరరావు, వుద్దిరాజు రవిచంద్ర, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌ఎ అలా వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు జంతర్ మంతర్ వద్దకు వెళ్లి మహిళా రెజ్లింగ్ క్రీడాకారులకు మద్దతు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News