Friday, December 20, 2024

వివేకా హత్యకు ముందు, తర్వాత..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపినేత, కడప ఎంపి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సిబిఐ ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో ఎన్నో అంశాలను దర్యాఫ్తు సంస్థ పొందు పరిచిం ది. ఇందుకు సంబంధించి హత్య జరిగిన రోజున నిందితుల మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణలకు సంబంధించిన వివరాలను కూడా ప్రస్తావించింది. 2019 మార్చి 14వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 15 ఉదయం 8 గంటల వరకు ఎవరెవరి మధ్య ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్లాయో వెల్లడించింది. వైఎస్ అవినాశ్ రెడ్డి తన తండ్రి వైఎస్ భాస్కర రెడ్డికి మార్చి 14వ తేదీ సాయంత్రం 6.18 నిమిషాలకు ఓ ఫోన్ కాల్ చేశారు.

ఉదయ్ కుమార్ రెడ్డి మార్చి 14న రాత్రి గం.9.12 నిమిషాలకు, ఆ తర్వాత మార్చి 15న ఉదయం గం.6.10 నిమిషాలకు రెండుసార్లు వైఎస్ అవినాష్‌కు ఫోన్ చే శాడు. శివశంకర రెడ్డి మార్చి 15వ తేదీ ఉదయం గం.5.58 నిమిషాలకు వైఎస్ అవినాష్‌కు ఫోన్ చేశాడు. మార్చి 14న సాయంత్రం నుండి రాత్రి వ రకు మూడుసార్లు ఫోన్ చేశాడు. గంగిరెడ్డి మార్చి 14న రాత్రి గం.8.02 నిమిషాలకు, మార్చి 15న ఉదయం మరోసారి శివశంకర రెడ్డికి ఫోన్ చేశా డు. గంగిరెడ్డి మార్చి 14న రెండుసార్లు సునీల్ యాదవ్‌కు ఫోన్ చేశాడు. ఉమాశంకర్ రెడ్డి మార్చి 15న ఉదయం గంగిరెడ్డికి ఒక ఫోన్ కాల్ చేశాడు. ఉమాశంకర్ రెడ్డి 5సార్లు సునీల్ యాదవ్‌కు ఫోన్ చేశాడు. 2 ఎస్సెమ్మెస్‌లు పంపించాడు. సునీల్ యాదవ్ కూడా రెండుసార్లు ఉమాశంకర్ రెడ్డికి ఫో న్ చేశాడు. షేక్ దస్తగిరి మూడుసార్లు సునీల్ యా దవ్‌కు ఫోన్ చేశాడు. 22 ఎస్సెమ్మెస్‌లు పంపించాడు. సునీల్ యాదవ్ రెండుసార్లు షేక్ దస్తగిరికి ఫోన్ చేశాడు. 4 ఎస్సెమ్మెస్‌లు పంపించాడు.

సాక్షి రంగయ్య గాంధీకి తరలింపు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షి గా వున్న రంగయ్యను పోలీసులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అస్తమాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆయన కొద్దిరోజుల క్రితం పులివెందులలో చికిత్స తీసుకున్నారు. అప్పటికీ నయం కాకపోవంతో రంగయ్యను తిరుపతి స్వి మ్స్‌కు తరలించారు. అయితే పరిస్ధితిలో మార్పు రాకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. రెండేళ్ల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రంగయ్య సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో రంగయ్యకు 1+1 భద్రతను అధికారులు కేటాయించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున రంగయ్య అదే ఇంటి వద్ద కాపలాగా ఉన్నా డు. హత్య జరిగిన రోజున ఏం జరిగిందనే విషయమై ఆయన దర్యాప్తు అధికారులకు వాంగ్మూ లం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రంగయ్యకు భద్రత ను కేటాయించారు.

కోర్టులో లొంగిపోతా: ఎర్ర గంగిరెడ్డి
మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి ఈ నెల 5వ తేదీన సిబిఐ కోర్టులో లొంగిపోనున్నారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను ఇప్పటికే తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5వ తేదీ లోగా ఎర్ర గంగిరెడ్డి సిబిఐ కోర్టులో లొంగిపోవాలని తెలంగా ణ హైకోర్టు ఆదేశించింది. దీంతో శుక్రవారం కోర్టులో లొంగిపోతానని ఎర్ర గంగిరెడ్డి మీడియాకు వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 27న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News