మూడు సార్లు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, రెండు సార్లు బిసిలు
అత్యధికంగా వెలమలదే ఆదిపత్యం, ఈ సారి ఎవరిదో, జాపల్లి దారి కాంగ్రెస్సేనా?, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటాపోటీ బిజెపికి హోరా హోరీ తప్పదేమో
మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ నియోజకవర్గం ఎప్పుడూ పరస్పర వైరుద్యమైన రాజకీయాలకు కేరాఫ్‌గా ఉందనడంలో అతిశయోక్తి కాదు. మాజీ మ ంత్రి బిఆర్‌ఎస్ నేత జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి రాం రాం చెప్పడంతో అసలైన రాజకీయం మెదలై ంది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంపై వెలమ సామాజిక వ ర్గందే ఆదిపత్యం కొనసాగుతూ వస్తోంది. స్వాత ంత్రం వచ్చినప్పటి నుంచి లెక్కలు తీస్తే రామచంద్రారెడ్డి, నర్సింహారెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి ( ప్రస్తుత ఎమ్మెల్యే) రెడ్డి సామాజిక వర్గం విజయం సాధించగా రెండు సార్లు బిసి సామాజిక వర్గానికి చెందిన రంగనాథ్ విజయం సాధించారు.
అయితే అత్యిధికంగా నాలుగుసార్లు జూపల్లి కృష్ణారావు ఎ మ్మెల్యేగా విజయం సాధించారు. వెలమ సామాజి క వర్గందే ఆధిపత్యం కొనసాగుతూ వస్తుంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో మొదటి సారి వెలమ సామాజిక వర్గంను దెబ్బ కొట్టి రెడ్డి సామాజిక వర్గం బిఆర్‌ఎస్ నుంచి విజయం సాధించింది. జూ పల్లి కృష్ణారావు మొదటి సారిగా 1999లో కాం గ్రెస్ నుంచి గెలుపొందగా 2005లో ఇండిపెండెండెట్‌గానూ. 2009 లో తిరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించగా ఆ తర్వాత జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. 20 12లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌లో చేరిన జూపల్లి భారీ విజయం నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లోనూ జూపల్లి టిఆర్‌ఎస్ నుంచి గెలుపొందారు. సిఎం కెసిఆర్ మంత్రి వర్గంలో జూపల్లి చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో టిఆర్’ఎస్ నుంచి పోటీ చేసిన జూపల్లి అనూహ్యంగా ఓటమి చెందారు.
ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బీ రం హర్షవర్దన్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీరం హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో కొల్లాపూర్‌లో ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడ లేవన్నట్లు ఓకే నియోజకవర్గంలో ఒకే పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం అయ్యాయి. అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి అనుచర వర్గం ఆధిపత్యమే కొనసాగింది. అయితే అధిష్టానం నచ్చచెప్పడంతో అ ప్పడు సమస్య పరిష్కారం అయినప్పటికీ లోలోపల రాజకీయ విబేధాలు మాత్రం సమిసి పోలేదు. జూ పల్లి, బీరం మధ్యన విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అధిష్టానం కూడా ఈ విషయంపై ఇద్దరిని రాజీ చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ స ఫలం కాలేదు. ప్రస్తుతం తిరిగి సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొల్లాపూర్‌లో రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది.
ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్న జూపల్లి కృష్ణారావు తన సహచర మిత్రుడైన పొంగులేటి సుధాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఖ మ్మం సభకు వెల్లి మద్దతు ఇవ్వడంతో బిఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో పా ర్టీ జూపల్లిని సస్పెండ్ చేసింది. దీంతో జూపల్లి రాజకీయ దారి ఎటూ అన్న ప్రశ్న ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన ఏ పార్టీకి వెళ్తారన్నది సందిగ్దంగా మారింది. ఇప్పటికే కొల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బీరం కు టికెట్ కన్‌ఫాం కావడం, బిజెపి నుంచి సుధాకర్ రావు బరిలో ఉంటున్నారు. కాంగ్రెస్ నుంచి జగదీశ్వర్‌రావు ఆశిస్తున్నారు. ఇప్పడు జూపల్లి ఏ పార్టీలోకి వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆలస్యం చేస్తే అమృతం విషం అన్నట్లు జూపల్లి విషయంలో అదే జరిగితే ఇండిపెండెంట్ తప్పదా అని చర్చించుకుంటున్నారు.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొల్లాపూర్ కా ంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఇక్కడ ముస్లింలు, దళితుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ రెండు సామాజిక వర్గ ఓట్లు బలంగా ఉన్నాయి. అయితే ఇటీవల బిజెపి అధినేత అమిత్‌షా ముస్లింకు 4 శాతం రిజర్వేషన్‌లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడ ంతో ఆ ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చే అవకాశాలు ఉన్న ట్లు అంచనా వేస్తున్నారు. అలాగే మొదటి నుంచి దళితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటున్నార న్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూపల్లి బిజెపి నుంచి కాకుండా కాం గ్రెస్ వైపే మొగ్గు చూ పించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఇక్క డ ట్విస్ట్ ఏమిటంటే మొదటి నుంచి కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న జగదీశ్వర్ రావు అంత సులభంగా టికెట్ వదులకుంటారా అన్నది కూడా అనుమానంగానే ఉంది. ఇక టిఆర్‌ఎస్ ప్రస్తుతం దళితులకు దళిత బంధు, ఇతర వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌కు దళితులు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ సారి ఆది పత్యం ఏ వర్గానిది ?
మొదటి నుంచి ఈ నియోజకవర్గంపై చెరగని ము ద్ర వేసుకుంటున్న వెలమ సామాజిక వర్గం దే రాజకీయం నడుస్తోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని రాజకీయంగా పైకి రానీయకూడదన్న ప్రధాన అంశం తోనే ఇక్కడ రాజకీయాలు నడుస్తాయని చెబుతా రు. వెలమలు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఎన్నికలు వ చ్చే సమయానికి నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక నేతను ఎన్నుకునే రాజకీయ చతురత ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న బీరం హర్ష వర్దన్ రెడ్డి ఒకరే ఒక వైపు నుంచి పోటీ చేస్తుంటే ఇక కాంగ్రెస్, బిజెపి నుంచి వెలమ సామాజిక వర్గం నేతలు నిలబడే అవకాశం ఉంది. ఇక జూపల్లి మూడో నేతగా బరిలో దిగే అవకాశం ఉంది. అంటే ముగ్గురు వెలమ నేతలు, ఒక రెడ్డి నేత మద్య పోటీ ఆసక్తికరంగా మారే అవకాశాలు లేక పోలేదు. మొత్తానికి కొల్లాపూర్ కోటపై ఈ సారి ఏ సామాజిక వర్గానిది పై చేయి అన్నది వేచి చూడాల్సిందే.