Friday, December 20, 2024

కన్న బిడ్డలను చూసేందుకు వస్తే భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించారు….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇద్దరు దంపతులు విడాకులు తీసుకున్నారు… కన్న పిల్లలను చూసేందుకు వెళ్తే భార్య, ఆమె కుటుంబ సభ్యులు భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. మదనపల్లెలో బావాజీ అలియాస్ బాబ్జీ(33), యాస్మిన్ (28) అనే దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య గొడవలు జరగడంతో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. డ్రైవర్స్ కాలనీలో ఉన్న పిల్లలను చూసేందుకు భర్త వెళ్లగా భార్య కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. భర్తపై పెట్రోల్ పోసి తగలబెట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బావాజీ 90 శాతం కాలిన గాయలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పరీక్షించిన వైద్యుల పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అదరగొడుతున్న ముంబై ఇండియన్స్.. ప్లేఆఫ్ అవకాశాలు సజీవం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News