- Advertisement -
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చే వారం విడుదల అయ్యే అవకాశం ఉంది. సోమవారం కానీ ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఎప్పుడైనా ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో మార్చి 15వ తేదీన్ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,48,010 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో ఎలాంటి తప్పులు, సమస్యలు చోటు చేసుకోకుండా ఇంటర్ ఫలితాలను పకడ్బందీగా వెల్లడించేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఫలితాల ప్రక్రియను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంటర్ ఫలితాల తేదీని ఒకటి రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు అధికారికంగా వెల్లడించనుంది.
- Advertisement -