Friday, December 20, 2024

ఆర్ టిసి బస్సు- ఆటో ఢీ: భార్యాభర్తల దుర్మరణం

- Advertisement -
- Advertisement -

కౌడిపల్లి: ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును టాటా ఏసి ఆటో బలంగా ఢీకొనడంతో 765 డి జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని మహమ్మద్ నగర్ గేట్ సమీపంలో మధ్యాహ్నం రెండు గంటలకు చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం చెందడంతో పాటు మరో నలుగురికి తీవ్రగాయాలై వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తూప్రాన్ డిఎస్పి యాదగిరి రెడ్డి తెలిపారు. డిఎస్పి యాదగిరి రెడ్డి వివరాల ప్రకారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం సాయిబాబా నగర్ కు చెందిన సప్పిడి నాగలింగరాజు తన కుటుంబ సభ్యులతో ఏడుపాయల వన దుర్గాదేవి దర్శనం చేసుకుని తిరిగి టాటా ఏసీ ఆటో నెంబర్ టిఎస్ 15 యుఏ 8609 నెంబర్ గల ఆటోలో తిరిగి ప్రయాణం అవుతున్న క్రమంలో మహమ్మద్ నగర్ గేట్ సమీపంలో రాగానే ముందుగా వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు గమనించక బలంగా ఢీకొన్నాడు.

రోడ్డు ప్రమాదంలో టాటా ఏసిలో ముందు భావన కూర్చున్న డ్రైవర్ సప్పిడి నాగలింగరాజు 36 అతని భార్య సప్పిడి రమా 33 ఇద్దరూ ఘటనా స్థలంలోని దుర్మరణం చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న వెంకటలక్ష్మి అమృత వైశాలి అవంతికలకు తీవ్ర గాయాలైనట్లు డిఎస్పి తెలిపారు తీవ్ర గాయాలైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ధృవీకరించాలని ఆయన తెలిపారు. మహమ్మద్ నగర్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే తూప్రాన్ డిఎస్పి యాదగిరి రెడ్డి, నర్సాపూర్ షేక్ లాల్ మదర్, కౌడిపల్లి ఎస్‌ఐ శివప్రసాద్ రెడ్డి తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని బస్ డ్రైవర్ హెల్మెట్ షేకులను అదుపులో తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టాటా ఏసీ డ్రైవర్ నాగలింగరాజు శవాన్ని జెసిపి సహాయంతో వెలికి తీసి పోస్టుమార్టం నర్సాపూర్ ఏరియాకి తరలించారు.

ఈ రోడ్డు ప్రమాదం జరిగే ప్రదేశం ఒంపుగా ఉండడంతో బస్ డ్రైవర్ ప్రమాదం జరగకుండా తీవ్ర ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయినట్లు డిఎస్పి తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలకా్ష్మరెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామగౌడ్ ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలను డిఎస్పిని అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News