Friday, November 22, 2024

ఆర్‌బిఐ కొత్త కెవైసి నిబంధనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు కెవైసి(నో యువర్ కస్టమర్)కి సంబంధించిన కొత్త నిబంధనలను ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) జారీ చేసింది. కస్టమర్‌కు సంబంధించిన సమాచారాన్నే కైవైసి అంటారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్‌ఎటిఎఫ్) సూచనలను అనుసరించి, సెంట్రల్ బ్యాంక్ కెవైసికి సంబంధించి తాజా సూచనలను ఆర్‌బిఐ జారీ చేసింది. ఈ సూచనలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కచ్చితంగా పాటించాలని ఆర్‌బిఐ పేర్కొంది. వైర్ బదిలీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఈ సూచనను ఇచ్చింది.

డొమెస్టిక్ లేదా క్రాస్ బోర్డర్ లావాదేవీలైనా అన్ని వైర్ బదిలీల సందర్భాలలో డబ్బును పంపినవారు, స్వీకరించే వారి పూర్తి వివరాలను ఇవ్వాలని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్‌బిఐ సూచించింది. అప్‌డేట్ చేసిన సూచనలలో రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ డొమెస్టిక్ వైర్ బదిలీ జరిగితే, పంపిన వ్యక్తి సంబంధిత సంస్థ లేదా బ్యాంక్ ఖాతాదారుడు కానట్లయితే, స్వీకరించే వారి సమాచారం ఉండాలని ఆర్‌బిఐ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News