Monday, December 23, 2024

మూడు రోజులు పిడుగుల వాన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలపైన పిడుగుల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హె చ్చరించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక అనుకుని ఉన్న తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోం ది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాం తాల్లో మరో మూడు రోజుల పాటు అక్కడక్కడ పి డుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న ట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు శనివా రం నాడు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రదేశం ఏర్ప డే అవకాశం ఉంది. ఇది అగ్నేయ బంగాళాఖాతం లో మే 8న వాయుగుండంగా కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది దాదాపు ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ తీవ్ర బలపడే అవకా శం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం వలన 8న రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడి గరిష్ట ఉష్ణోగ్రతలు సా ధారణ ఉష్ణోగ్రతలకంటే ఎక్కువగా పెరిగే అవకా శం ఉన్నట్టు తెలిపింది. రానున్న మూడు రోజులు ఉరుములు,మెరుపులు ఈదురుగాలులతో కూడి న వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది

17జిల్లాలకు

వాతావరణ కేంద్రం రాష్ట్రంలో 17 జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.మరో మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఖ మ్మం, మహబూబాబాద్, ములుగు, నాగర్‌కర్నూ ల్, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట,వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, మెదక్ ,రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జి ల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
గడచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.అత్యధికంగా మెదక్ జిల్లాలోని పాపన్నపేటలో 48.4 మి.మి వర్షం కురిసింది. గోల్కొండలో 41, తలమడుగులో 27.8, షేక్‌పేటలో 18, సంగారెడ్డిలో 16.2, నాయకల్‌లో 14.4, 11.8, కొం డాపూర్‌లో 10.2, జైనూర్‌లో 9.8 , అంబర్‌పేటలో 9.2, ,చార్మినార్‌లో 9.2, బికనూర్‌లో 7.4, తామ్సిలో 6.4, దుండిగల్‌లో 6.4, బోధ్‌లో 5.6మి.మి వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News