Monday, November 25, 2024

నమ్మకం మాటున మోసం.. కోడి కూర పెట్టి.. ఇంటిని దోచుకుని..

- Advertisement -
- Advertisement -

తమిళనాడు: మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారివల్లే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నమ్మకం అనేది కొన్ని సార్లు బలమైతే, మరికొన్ని సందర్భాల్లో బలహీనత అవుతుంది. కాబట్టి ఎవరినైనా నమ్మే ముందు జాగ్రత్తవహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా ఎందుకు అంటారా.. ఓ యువతిని పూర్తిగా నమ్మి స్నేహం చేసినందుకు ఓ మహిళకు కలలో కూడా ఊహించని సంఘటన ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూర్ లో రాజేశ్వరి అనే మహిళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ స్థానికంగా ఓ విలాసవంతమైన విల్లాలో నివాసముంటుంది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న యువతి వర్షణితో పరిచయం ఏర్పడింది. వర్షిణీ నమ్మకంగా ఉంటూ కొన్నాల్లపాటు రాజేశ్వరితో స్నేహం చేస్తూ వచ్చింది. ఓ రోజు కొందరు కస్టమర్లు ల్యాండ్ కొనేందుకు సిద్దంగా ఉన్నారని వర్షిని రాజేశ్వరితో చెప్పింది.

ఇదే అదునుగా బావించిన వర్షణి తన స్నేహితులైన అరుణ్ కుమార్, సురేంద్రన్, ప్రవీణ్ లను తీసుకుని వస్తూ రాజేశ్వరి కోసం నాటు కోడి కూర తీసుకుని వచ్చింది. కూరలో మత్తు మందు కలిపింది. ఇంటికి చేరుకున్నాక రాజేశ్వరికీ వారిని పరిచయం చేసింది వర్ఫిణి. మీకోసం నాటుకోడి కూర తీసుకువచ్చానని తినమని చెప్పి రాజేశ్వరికి వడ్డించింది. అది తిన్న కాసేపటికే తను స్పృహ కోల్పోయింది. వెంటనే మోసకారి వర్షిణి తన దొంగ బుద్దికి పనిచెప్పింది. ఇంట్లో ఉన్న రెండున్నర కోట్ల నగదు, బంగారం తో ముగ్గురు పరారయ్యారు. మత్తు నుంచి తేరుకున్న రాజేశ్వరికి తన ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వర్షిణి స్నేహితులను అరెస్టు చేసి, కొంత సొమ్మును రికవరీ చేశారు. ప్రధాన నిందితురాలైన వర్షిణి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News