Monday, December 23, 2024

నేడు సిఎస్‌కెతో ముంబై పోరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ ఈ రోజు జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత పెంచుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న సిఎస్‌కెను ఓడించడం ముంబైకి అనుకున్నంత తేలికేం కాదు. ఈ సీజన్‌లో చెన్నై అద్భుత ఆటతో అలరిస్తోంది. ముంబై మ్యాచ్‌లోనూ చెన్నైకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వేలు ఫామ్‌లో ఉండడం సిఎస్‌కెకు కలిచి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నా ఇతర బ్యాటర్లు అద్భుత ఆటతో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు గాడిలో పడడం ముంబైకి అతి పెద్ద ఊరటగా చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News