చెన్నై వేదికగా కాసేపట్లో ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది. చిదంబరం స్టేడియంలో శనివారం IPL 2023 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచింది. MS ధోని మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ సీజన్‌లో టాస్‌లో ధోనీ, రోహిత్ శర్మ ఇద్దరూ మిశ్రమ రికార్డులను కలిగి ఉన్నారు. ధోనీ ఐదు గెలిచి చాలా టాస్‌లు కోల్పోగా, రోహిత్ శర్మ తొమ్మిదికి ఐదు గెలిచాడు. జ్వరం కారణంగా ముంబయి స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో అతని అభిమానులు నిరాశ చెందుతున్నారు. రెండు పెద్ద టీమ్ మధ్య ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఎవరూ గెలుస్తారో చూడాలి మరీ.
ముంబయి టీం: రోహిత్ శర్మ, ఇషాన్, గ్రీన్, డేవిడ్, సూర్యకుమార్, నేహల్ వాదేరా, ఆర్చర్, పీయూష్ చావ్లా, ఆకాశ్, అర్షద్ ఖాన్, ట్రిస్టన్ స్టబ్స్
చెన్నై టీం: గైక్వాడ్, కాన్వే, రహానే, మోయిన్ అలీ, శివమ్ దూబే, జడేజా, ధోనీ దీపక్ చాహర్, పతీరాణా, దేశ్ పాండే, తీక్షణ