Friday, November 22, 2024

గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వం పెద్దపేట: మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

ఆలేరు: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీట వేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం లోని తుర్కపల్లి బొమ్మలరామారం గిరిజనుల టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు నాలుగు శాతం రిజర్వేషన్ ఉండే కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులతో వచ్చిన అనంతరం 12 శాతానికి పెంచారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల తండాలలో ”హమారో తండామా హమారో రాజ్యం” అనే నినాదంతో గిరిజన ప్రాంతాల్లో తండాల అభివృద్ధికి తోడ్పాటు రాష్ట్రంలో మూడువేలకు పైగా గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు 6 శాతం మాత్రమే రిజర్వేషన్ ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 10 శాతానికి తెచ్చారని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News