హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేడు జరగనుంది. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈపరీక్ష దాదాపు 20లక్షలమందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారని అంచనా. మరి ఈపరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు పోటోను తీసుకెళ్లాలి. ఫోటోను అటెండెన్స్ షీట్‌పై అతికించాలి.అభ్యర్తులు డ్రెస్‌కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పొడువు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్ వస్తువులు లోపలికి అనుమతి లేదు.సిప్లర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్ మాత్రమే వేసుకోవాలి.
పేపర్లు, జామెట్రీ, పెన్సిల్ బాక్సులు, ప్లాస్టిక్ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్ ప్యాడ్స్, పెన్‌డ్రైవ్స్, ఎలక్ట్రానిక్ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.గడియారాలు, వాలెట్లు, హ్యాండ్ బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటి కూడా ధరించకూడదు. సెల్పోన్లు, బ్లూటూత్, ఇయర్పోన్లు, పేజర్స్, హెల్త్ బ్యాండ్స్, స్మార్ట్‌వాచ్‌లు వంటి కమ్యూనికేషన్ డివైజ్‌లు లోనికి అనుమతించరు. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు బాల్ పాయింట్ పెన్నును పరీక్ష గదిలో ఇస్తారు.