Thursday, October 24, 2024

మే 8న సభలో నిరుద్యోగ డిక్లరేషన్: మానిక్‌రావు థాక్రే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో మే 8న జరిగే నిరుద్యోగ సభలో కాంగ్రెస్ జాతీయ నేత ప్రియాంక గాందీ నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించ నున్నారని ఎఐసిసి ఇంచార్జి మానిక్ రావు థాక్రే తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత చాలా నిరుత్సాహంలో ఉన్నారని ప్రియాంకా గాంధీ సభ ద్వారా ఉద్యోగ కల్పన లో జరిగిన అన్యాయంపై మాట్లాడుతారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగ కల్పనలో ఏం చేయబోతున్నామో చెప్పబోతున్నామని తెలిపారు.

యువత కాంగ్రెస్‌పై నమ్మకంతో ఉన్నారని తెలంగాణ యువత ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇచ్చిందని కాని తొమ్మిదేళ్ళలో ఆ ఆకాంక్షలు నేరవేరలేదని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హాయంలోనేని అన్నారు. టిపిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య పరిష్కారం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో యువత తెలంగాణ కోసం పోరాటం చేశారని రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందని పేర్కొన్నారు. నిరుద్యోగులకు అండగా ఉండడానికి ప్రియాంక గాంధీ వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

Also Read: రెండు తెలుగు రాష్ట్రాలకు ‘మోచా’ తుఫాను హెచ్చరికలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News