Thursday, December 19, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా నైజీరియాకు చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి 303 గ్రాముల కొకైన్, రెండు కార్లు, వేయింగ్ మిషన్, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున వాటి విలువ రూ.1,33,00,000 ఉంటుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని గుంటూరుజిల్లా, తాడే పల్లికి చెందిన చింతా రాకేష్ రోషన్, నైజీరియాకు చెందిన గ్యాబ్రియేల్ అలియాస్ పెటిట్, ఎపిలోని నెల్లూరూ జిల్లాకు చెందిన గజ్జెల శ్రీనివాస్ రెడ్డి, కాకినాడకు చెందిన సూర్యప్రకాష్ అలియాస్ డేవిడ్, నైజీరియాకు చెందిన విక్టర్ చుక్క్వా కలిసి కొకైన్ విక్రయిస్తున్నారు.

నలుగురు నిందితులను అరెస్టు చేయగా గ్యాబ్రియేల్ పరారీలో ఉన్నాడు. ప్రధాన నిందితుడు రాకేష్ రోషన్ కొన్ని ఏళ్ల క్రితం డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేశాడు, దాని నష్టం రావడంతో మూసివేశాడు. ఈ క్రమంలోనే గోవాలో నిర్వహించిన ఓ పార్టీలో పాల్గొని అక్కడ కొకైన్ తీసుకున్నాడు. అక్కడ డ్రగ్స్ విక్రయించే నైజీరియాకు చెందిన పెటిట్ ఎబూజర్ అలియాస్ గ్యాబ్రియేల్ పరిచయమయ్యాడు. అతడు గ్రాము కొకైన్‌ను రూ.7,000లకు విక్రయిస్తున్నాడు. అతడి వద్ద రాకేష్ తక్కువ ధరకు కొకైన్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అవసరం ఉన్నవారికి గ్రాముకు రూ.18,000లకు విక్రయించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే హోటల్ వ్యాపారంలో నష్టపోయిన గజ్జెల శ్రీనివాస్ రెడ్డి, సూర్యప్రకాష్ పరిచయమయ్యారు. ఈ ఇద్దరి ద్వారా రాకేష్ గోవా నుంచి కొకైన్ తెప్పించి హైదరాబాద్‌లో వ్యాపారులకు, అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు.

గోవా నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చినందుకు ఇద్దరికి రాకేష్ కమీషన్ ఇస్తున్నాడు. హైదరాబాద్‌లో కొకైన్‌కు చాలా గిరాకీ ఉందని చెప్పడంతో నైజీరియాకు చెందిన విక్టర్, శ్రీనివాస్ రెడ్డి 200 గ్రాముల కొకైన్ తీసుకుని వచ్చాడు. దానిని నానక్‌రాంగూడలో తిరుగుతుండగా మాదాపూర్ ఎస్‌ఓటి, రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా అసలు నిందితుల వివరాలు తెలిశాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News