Sunday, December 22, 2024

మూగ జీవాలు మురిసేలా..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: మంత్రి హరీశ్‌రావు కృషితో సిద్దిపేట విద్యాక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇప్పటికే సిద్దిపేటలో నాలుగు పాలిటెక్నిక్ కళాశాలలు, అందులో ఒక వెటర్నరీ, ఆగ్రికల్చర్, పాలిటెక్నిక్ ఉన్న ప్రాంతం సిద్దిపేట అదే దిశగా సిద్దిపేట సిగలో మరో విద్యా మణిహారం పశు వైద్య విద్యా కుసుమం పశు వైద్య కళాశాల ఏర్పాటు కానుంది. గత పర్యటనలో బాగంగా సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు గతంలో పశు వైద్య కళాశాల మంజూరు కాగా నేడు సిద్దిపేట కలెక్టరేట్ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.180 కోట్లతో సిద్దిపేట పశు వైద్య కళాశాల సముదాయంను మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ యాదవ్ శంకుస్ధాపన చేయనున్నారు.

జీవాల వైద్యులు..
మనుషులకు వైద్యం చేసే చదువులు ఉండటం మహా గొప్ప అనుకునే ఈ తరుణంలో రాష్ట్రంలో పశు సంపద పె రగడంతో గోప్ప విప్లవాత్మక మార్పు తెచ్చిన సిఎం కెసిఆర్ మూగా జీవాలకు కూడా ఆ స్ధాయిలో వైద్యం అందించే గొప్ప సంకల్పంతో పశు వైద్య విద్యకు ప్రోత్సహన్ని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన రాష్ట్రంలో హైదరాబాద్, కోరుట్ల, వరంగల్‌లో ఉన్న మూడు పశు వైద్య కళాశాలల ద్వారా సుమారు 240 మంది పశువ వైద్యులు ఉతీర్ణులు అవుతున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న పశు సంపదకు ,పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరిపడా పశు వైద్యులను తీర్చి దిద్దుట కోసం ఈ కళాశాల ఏర్పాటు చేసుకోబోతున్నాం. సిఎం కెసిఆర్ హామీతో మంత్రి హరీశరావు చొరవతో సిద్దిపేటలో పశు వైద్య కళాశాల ఏర్పాటు కానుంది. ఈ కళాశాలకు కావల్సిన బోధన సిబ్బందిని నియమించారు. కళాశాల ఏర్పాటుకు అవసరమైన 30 ఎకరాల స్థలం కూడా మంజూరు చేయగా నేడు కళాశాల భవనం బాయ్స్, గర్ల్ హాస్టల్ భవనాలకు మంత్రులు శంకుస్థ్ధాపన చేయనున్నారు. ఈ కళాశాలలో బ్యాచ్‌లర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పశు సంవర్ధక కోర్సులు ఏటా 80 మంది విద్యార్థులు చేర్చుకోబడతారు.

అనుమతులకు ప్రతిపాదనలు
వచ్చే విద్యా సంవత్సరానికి ఏర్పాట్లు
ఇప్పటికే ఈ కళాశాలకు విశ్వ విద్యాలయం ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ కళాశాలకు కావల్సిన వివిధ అనుమతుల కోరకు భారత పశు వైద్య మండలికి ప్రతిపాదనలు పంపగా వారు తనిఖీ బృందం కళాశాల మౌలిక వ సతులను పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సిద్దిపేటలో పశు వైద్య కళాశాల ఏర్పాటు కావడం చాలా సంతోషం: మంత్రి హరీశ్‌రావు
మనుషులకు వైద్యం అందించే పంటకు వైద్యం అందించే ఇప్పుడు పశువులకు వైద్యం అందించే వైద్యులను తయారు చేసే వైద్య కళాశాల లు సిద్దిపేటలో ఉండ టం ఎంతో సంతృప్తినిచ్చిందని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో పశు సంపద పెంచడంలో విద్యా వైద్యంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని సిద్దిపేటలో పశు వైద్య కళాశాల ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News