Monday, December 23, 2024

ప్లే జోన్‌లో తెగిన చిన్నారి వేళ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్లే జోన్‌లోని యంత్రంలో వేళ్లు పెట్టడంతో చిన్నారి వేళ్లు తెగిపడిన సంఘటన బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని సిటీ సెంటర్ మాల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బంజారాహిల్స్‌లోని ఇబ్రహీంనగర్‌కు చెందిన మెహతా జహాన్, మహియా బేగం కలిసి మగ్గురు పిల్లలను తీసుకుని సిటీ సెంటర్‌కు వెళ్లారు. అక్కడి నాలుగో అంతస్తులో ఉన్న ప్లే ఏరియాకి పిల్లలను తీసుకుని వెళ్లారు. పిల్లలు ఆడుకుంటుండగా మెహ్విష్ లుబ్నా(3) అక్కడ ఉన్న యంత్రంలోకి చేతిని పెట్టింది.

Also Read: బొడ్రాయి ప్రతిష్టాపన లో అపశృతి..

యంత్రంలో చేతిని పెట్టడంతో చిన్నారి మూడు చేతివేళ్లు, చూపుడు వేలు కొంత భాగం నలిగిపోయింది. అక్కడే ఉన్న బాలిక తల్లి చిన్నారిని యశోద ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. పరీక్షించిన వైద్యులు బాలిక కుడి చేతి మూడు వేళ్లను తొలగించారు. దీంతో ఆగ్రహించిన బాలిక తండ్రి సిటీ సెంటర్ మాల్ యాజమాన్యంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని, ప్లే ఏరియాలో పిల్లలను చూసుకోవడానికి సిబ్బంది లేరని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News