Monday, December 23, 2024

మాదాపూర్‌లో కార్డెన్ సెర్చ్.. మద్యం బాటిళ్లు సీజ్

- Advertisement -
- Advertisement -

భారీగా మద్యం బాటిళ్లు సీజ్

హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మస్తాన్‌నగర్‌లో పోలీసులు శనివారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డిసిపి శిల్పవల్లి ఆధ్వర్యంలో అడిషనల్ డిసిపి, ఎసిపి, 11 సెర్చ్‌పార్టీలు, 150మంది పోలీసులు కలిసి సెర్చ్ నిర్వహించారు. మస్తాన్‌నగర్‌లోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాలనీలోని వాహనాలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేశారు.

పత్రాలు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాలుగురు పాతనేరస్థులను గుర్తించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన రెండు బెల్టు షాపులను గుర్తించి 400 కాటన్ల మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా గ్యాస్‌ఫిల్లింగ్ చేస్తున్న షాపును, క్రాకర్స్ నిల్వ ఉంచిన షాపును గుర్తించామని డిసిపి శిల్పవల్లి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News