Saturday, November 23, 2024

నీట్ కు నిబంధనల పరీక్ష

- Advertisement -
- Advertisement -

ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష
తెలంగాణ నుంచి 70 వేలు, ఎపి నుంచి 68 వేలు
పరీక్ష రాసిన విద్యార్థులు
మనత తెలంగాణ /హైదరాబాద్: జాతీయస్థాయిలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం ఆదివారం నీట్ పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన నీట్ పరీక్ష సాయంత్రం 5.20 గంటలకు ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ అర్హత పరీక్షకు 18.72 లక్షల మంది హాజరయ్యారు. 499 నగరాలు/పట్టణాలతో సహా, విదేశాల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి 68,022 మంది నీట్ పరీక్షకు హాజరుకాగా తెలంగాణ నుంచి 70 వేల మంది హాజరయ్యారు. పరీక్ష హాల్లోకి ప్రవేశించే ముందు విద్యార్థులను నిశితంగా తనిఖీలు చేశారు.

చెవి కమ్మలు, ముక్కు పుడకలు, ఇతర ఆభరణాలు, ఉంగరాలు ధరించేందుకు అనుమతించలేదు. లోహంతో తయారైన ఎలాంటి వస్తువులను అధికారులు అనుమతించలేదు. కాగా, మణిపూర్ లో హింసాత్మక వాతావరణం నెలకొని ఉండడంతో అక్కడ నీట్ నిర్వహించలేదు. అయితే, నీట్ అభ్యర్థులు పరీక్ష సమయానికి వచ్చి రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. వారికి మరో రోజు నీట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News