- Advertisement -
సోనియా గాంధీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు చేసిన కరంద్లాజే.
బెంగళూరు: కర్నాటక ప్రతిష్ట , సార్వభౌమాధికారం లేదా సమగ్రతకు ముప్పు కలిగించేలా ఎవరినీ అనుమతించబోమని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేసిన ప్రకటనపై బిజెపి సోమవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కర్నాటక ప్రతిష్ఠ, సార్వబౌమాధికారం లేదా సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించబోదని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఈ ప్రకటన ‘దిగ్భ్రాంతికరం, ఆమోదయోగ్యం కాదు’అని పేర్కొంటూ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఫిర్యాదు దాఖలు చేశారు. సోనియా గాంధీ మోడల్ ప్రవర్తనా నియమావళి నిబంధనలు ఉల్లంఘించారని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ కరంద్లాజే ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఈసిని అభ్యర్థించారు.
- Advertisement -