Monday, December 23, 2024

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

- Advertisement -
- Advertisement -

సుక్మా (ఛత్తీస్‌గఢ్ ): ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో దంతేష్‌పురం గ్రామం వద్ద సోమవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో డీఆర్‌జీ జవాన్లకు ,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరిద్దరూ ఎల్‌ఒఎస్ నక్సల్ కమాండర్ మద్కమ్ ఎర్రా, ఆయ భార్య పొడియం బీమ్‌గా గుర్తించారు. మద్కమ్‌పై రూ. 8 లక్షలు, ఆయన భార్యపై రూ. 3 లక్షలు రివార్డులు ఉన్నాయని సుక్మా ఎస్‌పి సునీల్ శర్మ చెప్పారు. డిస్ట్రిక్ట్ రిజర్వుగార్డు (డిఆర్‌జి) టీమ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.

గొలపల్లి లోకల్ ఆర్గనైజేషన్ స్కాడ్ (ఎల్‌ఒఎస్) దాదాపు 35 మంది నక్సల్స్ బృందం ఉన్నట్టు సమాచారం అందడంతో డిఆర్‌జి, సిఆర్‌పిఎఫ్, కోబ్రా బృందాలు బెజ్జి అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి గాలింపు చేపట్టాయని ఎస్‌పి చెప్పారు. దంతేష్‌పురం అటవీ ప్రాంతాన్ని డిఆర్‌జి పెట్రోలింగ్ బృందం దిగ్బంధం చేయడంతో ఎదురెదురు కాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, ఐఈడీలు, ఆటోమెటిక్ వెపన్స్, ఇతర ఆయుధ సామగ్రి భారీ ఎత్తున స్వాధీనమైంది. మృతులు అనేక హింసాత్మక సంఘటనలు సాగించారని ఎస్‌పి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News