హైదరాబాద్ ః ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా కేరళ స్టోరీస్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన పార్లమెంట్ సభ్యుడు లక్ష్మ ణ్‌తో కలిసి కాచిగూడలోని తారకరామ థియేటర్ లో సినిమా చూశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ..పేరు ప్రఖ్యాతలు, వ్యాపారం కోసం సినిమా తీయలేదని, ఈ సినిమా సమాజానికి కొన్ని జాగ్రత్తలు చెప్పిందన్నారు. కేరళ తో పాటు దేశవ్యాప్తంగా ఐసిస్‌లాంటి ఉగ్రవాద సంస్థలు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లోబరుచుకుంటు న్నాయని, ఇది కేరళకు మాత్రమే పరిమితం కాదన్నారు. లవ్ జిహాద్ పేరుతో తెలంగాణ లో కూడా దారుణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సినిమాలో చూపించింది 5 నుంచి 10 శాతమే మాత్రమే అని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
దేశాన్ని అస్థిర పర్చాలని ఉగ్రవాద శక్తులూ చూస్తున్నాయని, ఈ సినిమాను తప్పకుండా మీ పిల్లలకు చూపించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తప్పకుండా కేరళ స్టోరీస్ సినిమా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓల్డ్ సిటీ లో సౌదీ నుంచి వచ్చి పెళ్లి చేసుకొని వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాకు పన్నునుంచి మినహయింపు ఇవ్వాలని కోరారు. కేరళ స్టోరీస్ సినిమా తీయడంతో డైరక్టర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన బండి సంజయ్ కరీంనగర్ లో జరిగే హిందూ ఏక్తా యాత్రకు కేరళ స్టోరీస్ సినిమా డైరక్టర్‌ను తీసుకుని తీసుకు రాబోతున్నట్లు తెలిపారు.
ఈ సినిమా రాజకీయపార్టీలకు కనువిప్పుకావాలని పార్లమెంట్ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. వినోదం కోసం ఈ సినిమా తీయలేదని ఇందులో యదార్థగాథను చూపించారని, ఉగ్రవాద సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాన్నారు. కేరళ సినిమాలో జరిగిన సంఘటనలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆధారాలు కావాలా అని ప్రశ్నించారు. ఈ సినిమాకు ప్రభుత్వం పన్ను రాయితీ ఇవ్వాలని కోరారు.