Friday, December 20, 2024

క్షేమంగా ఇంటికి..

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు
స్వాగతం పలికిన మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు
స్వస్థలాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు
ప్రభుత్వానికి, కెసిఆర్‌కు రుణపడి ఉంటాం: విద్యార్థులు, తల్లిదండ్రులు
మన తెలంగాణ/హైదరాబాద్/శంషాబాద్: మణిపూర్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విద్యార్థులను మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అనంతరం వారిని ప్రత్యేక బస్సుల్లో వారి స్వస్థలాలకు వెళ్లడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఆదివారం సాయంత్రానికి వారిని తీసుకురావా ల్సి ఉండగా అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో సోమవారం మధ్యాహ్నం తీసుకొచ్చారు.

సోమవారం ఉదయం మణిపూర్ రాజధాని ఇంఫాల్ మీదుగా బయలు దేరిన ప్రత్యేక విమానం మధ్యాహం రెండు గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. తెలంగాణ భవన్ అధికారులు మొదటి విడతగా 106 మంది విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకురాగా, వీరితో పాటుగా ఎపికి చెం దిన 108 మంది విద్యార్థులకు కూడా మరో విమానంలో శంషాబాద్‌కు వచ్చారు. మణిపూర్ నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన విద్యార్థులకు విమానాశ్రయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.హెచ్. మల్లా రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అడిషనల్ డిజిలు మహేష్ భగవత్, అభిలాష బిస్త్, డిఐజీ బి.సుమతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్‌లు స్వాగతం పలికారు.

మణిపూర్‌కు వెళ్లిన ప్రత్యేక విమానం
మణిపూర్‌లో అల్లర్లు, హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో అక్కడి ఐఐటితో పాటు ఇతర వి ద్యాసంస్థల్లో చదువుతున్న తెలుగు విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం శనివారం అప్రమత్తమైంది. బాధితుల సహాయార్థం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు హైదరాబాద్‌లోనూ ప్రత్యేక కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశారు. విద్యార్థులతో పాటు తెలంగాణవాసులు సుమారు 250 మంది అక్కడ ఉన్నట్టు ప్రభుత్వం గు ర్తించింది. ఈ నేపథ్యంలోనే వారిని తరలించేందుకు ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక విమానాన్ని పంపడంతో సోమవారం మధ్యాహ్నానికి క్షేమంగా వారిని శంషాబాద్‌కు తీసుకొచ్చారు.

విద్యార్థులకు అండగా సిఎం
మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యం లో తెలంగాణ విద్యార్థులకు సిఎం కెసిఆర్ అండగా నిలిచారు. ఈనేపథ్యంలోనే ప్రత్యేక విమాన వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరించనుంది. తెలంగాణ విద్యార్థుల సం క్షేమం పట్ల చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం వ్య వహారించిందని విద్యార్థులతో పాటు ప్రజలు ప్రశంసలు గుప్పించారు.

భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా చూస్తాం: మంత్రి మల్లారెడ్డి
మణిపూర్ నుంచి విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి విమానాశ్రయానికి వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ విద్యార్థులను ప్రత్యేక విమానంలో శం షాబాద్ తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వారిని బస్సుల్లో స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన ప్రకటించారు. వి ద్యార్థుల చదువులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని ఆ యన హామీ ఇచ్చారు. మణిపూర్‌లో పరిస్థితు లు సాధారణ స్థాయికి రాకపోతే వాళ్ల చదువులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడే ఏదో ఒక ఏర్పాటు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.

ప్రభుత్వానికి విద్యార్థుల కృతజ్ఞతలు
మణిపూర్‌లో జరుగుతున్న తాజా పరిస్థితులను శంషాబాద్ విమానాశ్రయంలో దిగగా నే విద్యార్థులు మీడియాతో తమ బాధలను పంచుకున్నారు. అక్కడి అల్లర్లులతో చాలా ఇబ్బంది పడినట్లు వారు వివరించారు. వసతి గృహాలోనే ఇన్ని రోజులు బిక్కుబిక్కుమంటూ తల దాచుకున్నామని వారు గుర్తు చేసుకున్నారు. తమను క్షేమంగా తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులను చూసిన తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

కెసిఆర్‌కు రుణపడి ఉంటాం
మణిపూర్‌లో పరిస్థితిని చూసి చాలా ఆందోళన చెందాం. మమ్మల్ని సురక్షితంగా హైదరాబాద్ తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు రుణపడి ఉంటామని పిఎల్ రావు చెప్పారు. మణిపూర్ నిట్ నుంచి 26 మంది అమ్మాయిలు ఈ విమానంలో వచ్చినట్లు సూర్యాపేటకు చెందిన సిహెచ్. స్ఫూర్తి (విద్యార్థిని) పేర్కొన్నారు. స్టేట్ ఎలక్ట్రానిక్స్ విభాగం ద్వారా ఎమ్మెల్సీ కవితతో మాట్లాడినట్లు స్ఫూర్తి తెలిపారు. కవిత తమకు ధైర్యం చెప్పారని, తమకు సహకరించారని ఆమె పేర్కొన్నారు. ఘట్‌కేసర్‌కు చెందిన సాయి కిరణ్ మాట్లాడుతూ తమ సమస్యపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News