రాహుల్ స్థానంలో ఇషాన్
డబ్లూటిసి ఫైనల్‌కు టీమిండియా ఎంపిక
ముంబై : ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడే టీమిండియాలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ కోసం మార్పులతో కూడా జట్టును భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) సోమవారం ప్రకటిచింది. గాయంతో ఫైనల్‌కు దూరమైన కెఎల్ రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు. ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన రాహుల్ డబ్లూటిసి ఫైనల్‌కు అందుబాటులో లేకుం డా పోయాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ఇక ఫాస్ట్ బౌల ర్లు ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జైదేవ్ ఉనద్కట్‌లు కూడా గాయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి స్థితి లో ముందు జాగ్రత్తగా ముకేశ్ కుమార్‌ను స్టాండ్‌బై బౌలర్‌గా ఎంపిక చేశారు. అంతేగాక బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్‌లను స్టాండ్‌బైలుగా తీసుకున్నారు. ఇదిలావుంటే జూన్ ఏడు నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్లూటిసి ఫైనల్ పోరు జరుగనుంది.