- Advertisement -
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాను మే 12 (శుక్రవారం) నాటికి తీవ్రంగా మారనున్నది. గాలి వేగం గంటకు 130 కిమీ. ఉండొచ్చని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తుఫాను మే 9న అల్పపీడనంగా మారి మే 10న మోచా తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను మే 12 నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారత వాతావరణ శాఖ ప్రకారం, మోచా తుఫాను సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద అల్పపీడనం ఏర్పడింది. తుఫాను మే 12నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల వైపు కదులుతుందని భావిస్తున్నారు.
- Advertisement -