Saturday, January 11, 2025

ఓఆర్‌ఆర్ పచ్చదనానికి ముగ్దులైన ఐఎఫ్‌ఎస్ టీమ్

- Advertisement -
- Advertisement -

డ్రిప్ సిస్టమ్, ఫ్లవరింగ్ ప్లాంట్స్‌పై అధ్యయనం
గ్రీనరీ ప్రత్యేకతలను వివరించిన డైరెక్టర్ ప్రభాకర్

హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) గ్రీనరీని చూసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ఆఫీసర్స్ మంత్రముగ్ధులయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 158 కిలోమీటర్ల మేర గ్రీనరీ మెయింటెనెన్స్ కోసం నిరంతరంగా పనిచేసే ఓఆర్‌ఆర్ డ్రిప్ సిస్టమ్ స్కాడా సెంటర్ పనితీరును ఐఎఫ్‌ఎస్ అధికారుల బృందం అధ్యయనం చేసింది. 1989 నుంచి 2014 బ్యాచ్‌లకు చెందిన తొమ్మిది రాష్ట్రాల నుంచి పదహారు (16) మంది ఐఎఫ్‌ఎస్ అధికారుల బృందం ‘ఎన్వీరాన్ మెంటల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ నీడ్ అండ్ మెథడ్స్ ఫర్ అసెస్ మెంట్’ అనే అంశంపై కంపల్సరి ట్రైనింగ్ కోర్స్‌లో భాగంగా మంగళవారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) గ్రీనరీని వారు సందర్శించారు. వీరిలో సీనియర్ అధికారి 1989 (ఒరిస్సా క్యాడర్) బ్యాచ్‌కు చెందిన పిసిసిఎఫ్ ఓంప్రకాష్ సింగ్ ఉన్నారు. ఓఆర్‌ఆర్ గ్రీనరీ నిర్వహణలో తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ గురించి అధికారులు హెచ్‌ఎండిఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఓఆర్‌ఆర్ మొత్తం సెంట్రల్ లైటింగ్
ఈ సందర్భంగా హెచ్‌ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్ ఓఆర్‌ఆర్ గ్రీనరీ నిర్వహణలో తీసుకుంటున్న మెళకువలను ఆయన వివరించారు. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు అందుకున్న తర్వాత తమ బాధ్యత ఎంతో పెరిగిందని వారు తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు మార్గ దర్శకత్వంలో, మెట్రోపాలిటన్ కమిషనర్ ఆర్విoద్‌కుమార్ పర్యవేక్షణలో అనతి కాలంలోనే ఔటర్ రింగ్‌రోడ్డు గ్రీనరీ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, రాత్రివేళ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఓఆర్‌ఆర్ మొత్తం సెంట్రల్ లైటింగ్ (విద్యుదీకరణ) ఏర్పాట్లు జరిగాయని ప్రభాకర్ వారికి వివరించారు.

సోలార్ సైకిల్ ట్రాక్ పనుల పరిశీలన
ఓఆర్‌ఆర్ క్షేత్రస్థాయి పర్యటన తదుపరి నానక్ రామగూడలోని ఓఆర్‌ఆర్ డ్రిప్ ఆటోమేషన్ సెంటర్ పనితీరును ఐఎఫ్‌ఎస్ అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఓఆర్‌ఆర్ మీద వివిధ రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ (పూల మొక్కల)ను చూసి వారు ఆశ్చర్యపోయారు. ఏడాది పొడవునా ఔటర్ రింగ్ రోడ్డుపై పూల మొక్కలు కనువిందు చేస్తాయని డైరెక్టర్ ప్రభాకర్ వారితో వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు వెంట సర్వీస్ రోడ్డులో ఉన్న సోలార్ సైకిల్ ట్రాక్ పనులతో పాటు హెచ్‌ఎండిఏ దుండిగల్ నర్సరీని వారు పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News