Friday, December 20, 2024

తెలంగాణకు తప్పిన తుపాన్ ముప్పు !

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం
43డిగ్రీలకు పగటి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుపాన్ ముప్పు తెలంగాణ రాష్ట్రానికి తప్పిపోయింది. మంగళవారం నాటి అంచనాల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ అండమాన్ సముంద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది సాయంత్రానికి తుపానుగా మారి బలపడింది. ఇది ఉత్తర ,ఉత్తర ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్‌మయన్మార్ తీరం వైపు వెళుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి గాలి విచ్చితి తెలంగాణ నుంచి తమిళనాడు వరకూ 1.5కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించింది.

దీని ప్రభావంతో ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. బుధవారం నుంచి రాష్టంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి రాష్ట్రంలోని కొన్ని చోట్ల సుమారు 40నుంచి 43డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపింది. హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది.మంగళవారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పుంజుకున్నాయి.అత్యధికంగా నల్లగొండలో 40.5 డిగ్రీలు , అదిలాబాద్‌లో 40డిగ్రీలు నమోదయ్యాయి. భద్రాచలంలో 38.2 హన్మకొండలో 38, హైదరాబాద్‌లో 36.7, ఖమ్మంలో 39.4, మహబూబ్ నగర్‌లో 35.8, మెదక్‌లో 37.8, నిజామాబాద్‌లో 37.4, రామగుండంలో 39.6డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గాంధారిలో36.4మి.మి వర్షం
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. కామారెడ్డి జిల్లా గాంధారీలో 36.4మి.మి వర్షం కురిసింది. చందూరులో 17, మంథనిలో 15.4, వడ్డెపల్లిలో 14.8, నారాయణపేటలో 12.2, మెదక్‌లో 12, కోసిగిలో 10.6 మి.మి వర్షం కురిసింది. మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News