- Advertisement -
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరుతున్నారు. క్యూలో నిలబడిన ఓటర్లు సాయంత్రం ఆరు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. కర్నాటకలో 224 అసెంబ్లీ స్థానాలలో పోలింగ్ జరుగుతోంది. బిజెసి, కాంగ్రెస్, జెడిఎస్, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి 2615 మంది పోటీ చేస్తున్నారు. పురుష అభ్యర్థులు 2430, మహిళలు 184 మంది ఉన్నారు. కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా 5.31 కోట్ల మంది ఓట హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58,545 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
Elderly couple casting their vote. #Karnataka #KarnatakaElections pic.twitter.com/F0Qe3aYLDj
— Imran Khan (@KeypadGuerilla) May 10, 2023
- Advertisement -