Thursday, April 17, 2025

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రసన్న నగర్ లో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ కమ్మేయడంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. భవనంలోని జనాలు బయటకు పరుగులు పెట్టారు. మంటల్లో ఒకరు చిక్కకున్నారని స్థానికులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే వివరాలు తెలియాల్సిఉన్నాయని అధికారులుల వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News