మల్యాలః కొండగట్టు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుభీక్షంగా ఉండాలని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. బుధవారం కొండగట్టు ఆలయంలో ఎంఎల్‌సి కవిత స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ మంచి జీవితాన్ని ప్రసాదించేటటువంటి, ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి, విజయాన్ని అందించే ఆంజనేయ స్వామిని కొలిచినట్లయితే ప్రజలందరూ సుభీక్షంగా ఉంటారని అన్నారు.
తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుందని, కరోనా కష్ట సమయంలో తెలంగాణ ప్రజలందరూ సుభీక్షంగా ఉండాలంలే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని కొండగట్టు ఆలయ పూజారి జితేంద్రయ్య సూచించారు. ఆంజనేయ స్వామి పారాయణానికి మించిన మందు లేదని అన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కొండగట్టు అంజన్న సేవా సమితి పేరుతో జితేంద్రయ్య నేతృత్వంలో అందరం కూడా పారాయణం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ద్విగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నామి ఎంఎల్‌సి కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంత, చొప్పదండి ఎంఎల్‌ఎ సుంకె రవిశంకర్, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.