Saturday, November 23, 2024

‘కేరళ స్టోరీ’పై బెంగాల్ నిషేధం…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వివాదాస్పద కేరళ స్టోరీ చిత్రాన్ని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిషేధించడంపై నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాము రోజువారీ రాబడి కోల్పోతున్నామని, నిర్మాతలు తమ పిటిషన్‌లో వివరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం ముందు అత్యవసర విచారణ జాబితాలో చేర్చాలని కోరారు. పశ్చిమబెంగాల్ నిషేధాన్ని అలాగే తమిళనాడు ప్రభుత్వ నిషేధాన్ని ఈ పిటిషన్ సవాలు చేస్తోందని సాల్వే వివరించారు.

ఈ సినిమా విడుదలపై స్టే విధించడానికి కేరళ హైకోర్టు నిరాకరించిన దానిపై దాఖలైన ప్రత్యేక వ్యాజ్యంపై ఈనెల 15 న విచారణ ఉంటుందని, ధర్మాసనం వివరించింది. అందువల్ల ఈ తాజా పిటిషన్ పై ఆరోజు విచారిస్తామని ధర్మాసనం వివరించింది. అయితే తాజాగా దాఖలైన నిర్మాతల వ్యాజ్యంపై ఈ నెల 12 న విచారణకు ధర్మాసనం అంగీకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News