Monday, December 23, 2024

వివేకా హత్య కేసు మళ్లీ సుప్రీంకోర్టుకు సునీతా రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి తాజాగా మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసులో సునీతా రెడ్డి వివిధ అంశాలను వ్యతిరేకిస్తూ గతంలో పలుమార్లు సుప్రీం కోర్టుకు వెళ్లిన సంగతి విదితమే. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు వేగంగా జరుగుతున్న వేళ ఇలా జరగడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి గతంలో బెయిల్ రద్దు ఇవ్వడంతో ఆ ఉత్తర్వులలో ఓ షరతును సుప్రీం కోర్టులో సునీతా రెడ్డి సవాలు చేశారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు జులై 1న మళ్లీ విడుదల చేయాలని సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది.

వివేకా హత్య కేసులో జూన్ నెలాఖరులోపు దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ తర్వాత జులై 1న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పులో వెల్లడించింది. అయితే, జులై 1న మళ్లీ బెయిల్‌పై గంగిరెడ్డిని విడుదల చేయాలన్న అంశంపై సునీతా రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారు. బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదాహరణలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. సాక్షులను కూడా బెదిరించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. అయితే, సునీతా రెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించింది. ఇది వచ్చేవారం విచారణకు వస్తుందని సమాచారం. అయితే సుప్రీంకోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News