మన తెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీలోకి బుధవారం కూడా చేరికలు కొనసాగాయి. బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నేత అన్నాబావు సాఠే మనవడు సచిన్ సాఠే, వైంటీ వైభవ్ కదం (మాజీ జెడ్‌పి సభ్యుడు), ప్రమోద్ విఠల్ జాదవ్ (మాజీ జెడ్‌పి సభ్యుడు, సిర్వాల్ సతారా), మేనేష్ రాహుల్ గాడ్సే (పి.ఎస్ స భ్యుడు), అజర్ ఖాన్ (మాజీ ఇండియన్ ఎయిర్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్), వభూ వసంత రావు కదం (ఇండియన్ ఎయిర్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్, రీజినల్ కార్యదర్శి) శ్రీనివాస్ ఇస్తారి ఎలిగేటి (మాజీ కార్పొరేటర్ భివండి) రామదాస్ ఘరత్ (జెడ్‌పి సభ్యుడు, శివసేన ఠాక్రే నుంచి 2024లో ఎంఎల్‌ఎ అభ్యర్థి), అనునయ బిక్కడ్ బిజెపి యువ మోర్చా నీలం సునీల్ పోక్లే (రాష్రవాది కాంగ్‌స్,్ర పతోడా మమహిళా ప్రెసిడెంట్ బీడ్, ప్రియా నాగదేవత సిఎం కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి, చెన్నూరు ఎంఎల్‌ఎ బాల్క సుమన్, మహారాష్ట్ర బిఆర్‌ఎస్ నేతలు మాణిక్ కదమ్, శంకరన్న డోంగే, బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారి తదితరులున్నారు.