Monday, December 23, 2024

కాంగ్రెస్ ధన బలం… బిజెపి పవర్ పెత్తనం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ధన బలం… బిజెపి పవర్ పెత్తనం
కర్నాటక ఫలితాల అంచనాపై కుమారస్వామి
బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ధనబలం, అధికారంలో ఉన్న బిజెపి కనబర్చిన కండబలం యుక్తులు కుయుక్తులతో తమ పార్టీ నష్టపోయిందని జెడిఎస్ నేత కుమారస్వామి తెలిపారు. పలు విధాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయితే జన బలం తమకు ఉందని, తమకు ఇప్పటి ఎగ్జిట్ పోల్ సర్వే పలితాల కన్నా ఎక్కువ స్థానాలే వస్తాయని, తాము కింగ్ మేకర్లం కామని, కింగ్‌లమే అవుతామని తన నివాసంలో కొందరు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

చిక్కబళ్లాపురం, దొడ్డబళ్లాపురం వంటి చోట్ల తమ పార్టీ అభ్యర్థులకు సరైన విధంగా ఆర్థిక సాయం ఇవ్వలేకపోయినట్లు తెలిపిన కుమార బిజెపి, బిజెపిలు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినట్లు దీనితో ఇటువంటి పలు స్థానాలలో తమ పార్టీకి చుక్కెదురు అయిందన్నారు. నిధుల కొరతతో తాము 20 నుంచి 25 స్థానాల్లో వెనుకబడ్డామన్నారు. అన్ని నియోజకవర్గాలలో సరైన రీతిలో కనీసమైన ఖర్చుకు కూడా వీలు కాలేదని తెలిపారు. ఇతర పార్టీలు ఎన్నికలను ధనంతో ముడిపెట్టాయన్నారు. పార్టీకి తగు రీతిలో విరాళాలు దక్కలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News