Friday, December 20, 2024

అన్నం వండలేదని భార్య ప్రాణం తీసిన భర్త

- Advertisement -
- Advertisement -

 

అన్నం వండి పెట్టలేదని భార్యను భర్త కొట్టి చంపిన సంఘటన ఒడిశా రాష్ట్రం సంబల్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నౌది గ్రామంలో సనాతన్ ధరౌ(40), పుష్ఫ ధరౌ(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నాడు. కూతురు కుచిందా గ్రామానికి వెళ్లింది. కుమారుడు ఆదివారం రాత్రి పడుకోవడానికి తన స్నేహితుడు ఇంటికి వెళ్లాడు.

భర్త సనాతన్ ఇంటకి వచ్చేసరికి భార్య కూర వండింది కానీ అన్నం వండలేదు. దీంతో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో కర్రతో కొట్టాడు. తన కుమారుడు ఇంటికి వచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో కనిపించింది. గ్రామస్థులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని జమన్‌కిరా పోలీస్ స్టేషన్ అధికారి ప్రేమ్‌జిత్ దాస్ తెలిపారు. సనాతన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని వెల్లడించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Also Read: యువజంట ముద్దులు…. ఢిల్లీ మెట్రో సుద్దులు (వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News