- Advertisement -
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలంలోనే 10వ తరగతిలో 10/10 మార్కులు సాదించిన విద్యార్థిని చందాయిపేట గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ శాలువాతో సన్మాణించారు. గురువారం రోజున చందాయిపేట గ్రామానికి చెందిన బొర్ర సత్యనారాయణ కుమారుడు బొర్ర సాయిరాం 10వ తరగతిలో 10 జీపీఎ సాదించి మండడంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ సాయిరాంను శాలువాతో ఘనంగా సన్మాణించి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ…. చందాయిపేట విద్యార్థి మండలంలో మొదటి ర్యాంకు సాదించినందుకు సంతోషంగా ఉందని ఆదే విదంగా మా గ్రామ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ 100 శాతం ఉత్తీర్ణత సాదించారని తెలిపారు.
- Advertisement -