Monday, December 23, 2024

ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక సంఘటన సత్తుపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం… సత్తుపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన పాటిబండ్ల ప్రశాంత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి సుమారు 12 సంవత్సరాల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, దమ్మపేట గ్రామానికి చెందిన అడపా కృష్ణయ్య కుమార్తె మృదుల (38) ని ఇచ్చి వివాహం జరిపించారు. అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డ ప్రశాంత్ ఏడు సంవత్సరాల క్రితం తిరిగి హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ , బెట్టింగ్ షేర్ మార్కెటింగ్, ఆన్లైన్ కాయిన్స్ వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి అమెరికాలో ఉండి హైదరాబాదులో సంపాదించిన విలువైన ఆస్తులను క్రమ క్రమంగా అమ్ముకున్నాడు.

ఈ క్రమంలో పాటిబండ్ల మృదుల పేరు మీద మృదుల తల్లిదండ్రులు పెళ్లి సమయంలో కట్నం కింద ఇచ్చిన ఏడున్నర ఎకరాల భూమిని, పెళ్లి సమయంలో ఇచ్చిన నగదు ను ఆరు నెలల క్రితం ఆరున్నర లక్షలకు అమ్మినట్లు, మృతురాలి హ్యాండ్ బ్యాగ్ లో రశీదులు దొరికాయి. దీనితో పాటుగా కట్నం కింద ఇచ్చిన ఏడున్నర ఎకరాల భూమిని అమ్ముకుందామని భర్త ప్రశాంత్ భార్య మృదులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో, శనివారం మృదుల పిన్నికి వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి విజయవాడకు వెళ్లి అక్కడ కృష్ణా నదిలో దూకే ప్రయత్నం చేసింది. మరలా ఆలోచించి నా శవం దొరకదేమో అని సందేహంతో సోమవారం రాత్రి 8. గంటలు సమయంలో సత్తుపల్లి బస్టాండ్ లో దిగి తర్వాత విజయవాడలో ఉన్న తన పిన్నికి ఫోన్ చేసి తాను పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం చేరవేసి, సోమవారం రాత్రి 8 గంటల సమయంలో తన ఇద్దరు పిల్లలను తీసుకొని నడుచుకుంటూ సత్తుపల్లి పట్టణ శివారులో ఉన్న తామర చెరువు వద్దకు వెళ్లి చెరువు కట్టపై తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ,

హ్యాండ్ బ్యాగ్ చెరువు గట్టుపై ఉంచి ఇద్దరు పిల్లల్లో పెద్ద పిల్లవాడు ప్రజ్ఞాన్ (8)ని తన చున్నీతో నడుముకి కట్టుకొని, చిన్నపిల్లవాడు మహన్ (5) ని సంకలో ఎత్తుకొని పట్టణ శివారులో ఉన్న తామరచెరువులో దూకి బలవనర్మరణం మరణానికి పాల్పడింది. సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా స్థానిక పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో మంగళవారం ఉదయం తామర చెరువులో శవాలు పైకి రావడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం మృతిరాలి బంధువులకు మృతదేహాలను అప్పగించారు. ఈ విషయం తెలిసిన బంధువులు దమ్మపేట, సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో మృత్యు వార్తతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన పై మృతురాలి తండ్రి అడపా కృష్ణయ్య ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు స్థానిక ఎస్సై బి రాము తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News