హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ఈసారి కొత్తగా బిఎస్‌సి ఆనర్స్ కోర్సును అందుబాటులోకి రానుంది. 2023 -24 విద్యాసంవత్సరం నుంచే 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటు మరికొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ కోర్సులో ప్రవేశాలు పొందిన విద్యార్థులు మూడేళ్ల తర్వాత కూడా ఆపేయవచ్చు. మూడేళ్ల తర్వాత నిలిపివేసిన విద్యార్థులకు బిఎస్‌సి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఇస్తారు.
నాలుగేళ్లు పూర్తి చేసిన వారికి మాత్రం బిఎస్‌సి కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. రెండేళ్ల క్రితం తొలిసారిగా పొలిటికల్ సైన్స్, ఆర్థికశాస్త్రంలో బి.ఎ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టారు. నిజాం కళాశాల, కోఠి మహిళా కళాశాల, బేగంపేట మహిళా, సిటీ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. తాజాగా బిఎస్‌సి కంప్యూటర్ సైన్స్‌కు కూడా ఆనర్స్‌ను విస్తరించారు.