- Advertisement -
హైదరాబాద్: ఉగ్రకుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. బయాన్ పేరుతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఎటిఎస్ గుర్తించింది. మహమ్మద్ సలీం అనే వ్యక్తి బయాన్ పేరుతో హైదరాబాద్‌లో భేటీలు ఏర్పాటు చేశారు. గోల్కొండలోని సలీం ఇంట్లోనే భేటీలు జరిగాయి. మధ్యప్రదేశ్ ఎటిఎస్ విచారణలో వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు 17 మంది నిందితులను యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ అరెస్ట్ చేసింది. ఇజబ్ ఉట్ తెహ్రిర్ ఉగ్రవాద సంస్థతో గురువారం అరెస్టు చేసిన వారికి సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. 16 దేశాల్లో ఇజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థపై నిషేధం ఉంది.
Also Read: లైంగిక ఆరోపణల కేసులో ట్రంప్‌కు భారీ షాక్..
- Advertisement -