Sunday, January 19, 2025

వరంగల్‌లో వైద్యురాలు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వరంగల్: అత్తింట్లో వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫిజయోథెరపీగా పని చేస్తున్న కుందూరి నిహారికా రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన చార్టెడ్ ఆకౌంటెంట్‌గా పని చేస్తున్న గంగాధర్ రెడ్డికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. దంపతులకు నాలుగు నెలల పాప ఉంది. పెళ్లి సమయంలో కట్నం కింద అతడికి నగరంలో 300 గజాల ప్లాట్, బీరువా, నగదు, బంగారు ఆభరణాలు ముట్టచెప్పారు.

కారు కావాలని గంగాధర్ రెడ్డి అడగగా అత్తింటి వారు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ పెళ్లి లాంఛనాల విషయంలో అత్తింటివారితో నివాహారికకు గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు వేర్వేరు రూమ్‌ల్లో నిద్రించారు. గురువారం ఉదయం పాప బిగ్గరగా ఊపిరి పట్టి ఏడుస్తుండడంతో భర్తకు అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లాడు. భార్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ అధికారి షూకుర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భర్త, అత్త మామ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి మల్లారెడ్డి ఫిర్యాదులో వివరించారు.

Also Read: యువజంట ముద్దులు…. ఢిల్లీ మెట్రో సుద్దులు (వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News