హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి వ్యవసాయ రంగం, ఐటి నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నా రు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగ వంతమైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం లోని ప్రాథమిక సమస్య లన్నింటి పైనా దృష్టి సారించి, వాటి పరిష్కారాని కి ప్ర యత్నించామని వివరించారు. ఇన్నోవే షన్, మౌలిక వసతుల సదుపాయాల క ల్పన వంటి అం శాలపైన 9 సంవత్సరా లుగా తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం పని చేస్తుందని తెలిపారు. లండన్‌లోని భా రత హై కమిషనర్ విక్రం కె. దురై స్వా మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్ మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కె. తారక రామారావు ప్రసంగిం చారు.
ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన పలు కంపెనీల ప్రతినిధులు, ఇతరులకు తెలంగాణలోని పెట్టుబడి అ వకాశాల గురించి మంత్రి కెటిఆర్ వివ రించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో అనుమ తుల విధానం గురించి ప్రత్యేకంగా మంత్రి కెటిఆర్ ప్రస్తావించారు. అత్యంత వేగంగా, పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ఈ విధానం ఇ ప్పటికే అనేక ప్రశంసలను అందుకుందని, ఫలి తాలను ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్ నగ రంలో టెక్నాలజీ ఆధారిత కంపెనీల పెరుగుదల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి కెటిఆర్ అన్నారు. ఎలక్ట్రా నిక్స్, ఏరోస్పేస్, డిఫన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మొబి లిటీ, టెక్స్‌టైల్ వంటి రంగాలలో ఉన్న పెట్టుబడి అవకాశాలను మంత్రి వివరించారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న ఇన్నోవేషన్ ఈకో సిస్టం, పరిశో ధనా సంస్థలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, ప్రపం చ ప్రసిద్ధ కంపెనీలు వలన ఆయా రంగాల్లో అ భివృద్ధి వేగంగా కొనసాగుతుందన్నారు. తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం యుకె విద్యాసంస్థలు కింగ్స్ కాలేజ్, క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వంటి ప్రసిద్ధ సంస్థలతో చేసుకున్న భాగస్వామ్యాల ఏర్పాటుకు ప్రస్తావించారు.
పెట్టుబడులతో తెలంగాణ రాష్ట్రానికి రావాలి
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు రావాలని మంత్రి కెటిఆర్ కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ముందుకు వచ్చి సంస్థలకు సహకరించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఇండియన్ హై కమిషనర్ విక్రమ్ కే దురై స్వామి హెవీ మిషనరీ, ఏవియేషన్, డిఫన్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో యుకె కంపెనీలతో భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలను వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, విభిన్న సంసృతుల సమ్మేళనమైన పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ఒక అద్భుతమైన గమ్య స్ధానమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన అద్భుతమైన ప్రగతిని బ్రిటిష్ భారత వ్యాపారవేత్త కరెంట్ బిల్లీమోరియా వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసిన నూతన సచివాలయం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వంటి వాటిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతి, ముఖ్యంగా ఆర్థిక ప్రగతి, సంపద సృష్టి వంటి అంశాలను వివరించారు. తన సొంత రాష్ట్రం తెలంగాణ ఎదుగుతున్న తీరుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. లండన్‌లో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఎన్‌ఆర్‌ఐ అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి ఇ. విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.