Monday, December 23, 2024

ప్రేక్షకులకు మరచిపోలేని బహుమతి

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందు కు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ హీరోయిన్ గౌతమి మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…

డ్రీమ్ మదర్, వైఫ్‌గా కనిపిస్తా…

సినిమాలో నా పాత్ర పేరు మీనాక్షి. చాలా లవ్లీ క్యారెక్టర్. ఒక డ్రీమ్ మదర్, వైఫ్‌గా కనిపిస్తా. తను ఫ్యామిలీని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది. నా కెరీర్ ప్రారంభంలో రాజేంద్రప్రసాద్‌తో నటించాను. మళ్ళీ ఇప్పుడు అదే జోడిలో చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

మరచిపోలేని బహుమతి…

నరేష్, షావుకారు జానకీ, ఊర్వశి లాంటి మంచి నటులతో కలిసి నటించడం చాలా సంతోషంగా వుంది. అంత మంది మంచి నటులను నందిని, స్వప్న ఎలా ఒక్క దగ్గరకు చేర్చారో నాకు తెలియదు కానీ నిజంగా అద్భుతం. ప్రేక్షకులకు మరచిపోలేని బహుమతి ఈ సినిమా.

వండర్‌ఫుల్ ప్రొడ్యుసర్స్…

నందిని రెడ్డి గోల్డెన్ హార్ట్ డైరెక్టర్. తను ఎప్పుడూ ప్రశాంతంగా వుంటుంది. స్వయం నియంత్రణ వున్న దర్శకురాలు. స్వప్న విషయానికి వస్తే ఒక గొప్ప నిర్మాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ తనలో కనిపించాయి. ప్రియాంక, స్వప్న ఇద్దరూ వండర్‌ఫుల్ ప్రొడ్యుసర్స్. ఈ విషయంలో అశ్వినీదత్‌కి నిజంగా హ్యాట్సాప్.

బ్యూటిఫుల్‌గా తీర్చిదిద్దారు…

దర్శకురాలు నందిని ఒకొక్క పాత్రని చాలా బ్యూటిఫుల్‌గా తీర్చిదిద్దారు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల మనసులో ఒక హాయి ఉంటుంది. వెన్నెల కిషోర్ టైమింగ్ చాలా బావుంటుంది. అలాగే ఈ సినిమాలో అందరూ కూడా మంచి టైమింగ్ వున్న నటులే.

నెక్స్ ప్రాజెక్ట్‌లు…

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఒక వెబ్ సిరీస్ పూర్తయింది. అలాగే మరో అమెజాన్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News