Monday, December 23, 2024

రియర్వాయర్‌లో మహిళ మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: డివిజన్ కేంద్రంలోని రిజర్వాయర్‌లో శనివారం తెల్లవారుజామున స్థానికులు ఓ వివాహిత మృతదేహాన్ని గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే పసిగుడ్డు రిజర్వాయర్‌లో శవమై తేలిన సంఘటన మరువకముందే మహిళ మృతదేహం రాజర్వాయర్‌లో తేలడం స్టేషన్ ఘన్‌పూర్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శ్రావణ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి స్థానిక యువకుల సహకారంతో శవాన్ని రిజర్వాయర్ నుంచి బయటకు తీయించారు. సంఘటనను విచారణ చేపట్టి గుర్తుతెలియని ముస్లిం మహిళ శవంగా నిర్దారణ చేశారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రఘుచందర్, సీఐ రాఘవేందర్ సందర్శించగా ఆయన వెంట సిబ్బంది రవికుమార్, శ్రీనివాస్, అనిల్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News