Monday, December 23, 2024

క్రికెటర్‌ త్రిషకు సన్మానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్ అండర్19 మహిళా క్రికెటర్, తెలుగుతేజం జి.త్రిషాను శనివారం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) ఆధ్వర్యంలో సన్మానించారు. భారత్‌కు అండర్19 వరల్డ్‌కప్ ట్రోఫీని అందించడంలో త్రిషా తనవంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. యూత్ వరల్డ్‌కప్‌లో త్రిషా అద్భుత ఆటతో అలరించింది.

దీంతో ఆమెను సన్మానించాలని హెచ్‌సిఎ నిర్ణయించింది. శనివారం ఉప్పల్ వేదికగా లక్నోసన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా త్రిషాను సత్కరించారు. క్రికెట్ దిగ్గజం, సన్‌రైజర్స్ ప్రధాన కోచ్ బ్రియాన్ లారా త్రిషాను సన్మానించారు. భవిష్యత్తులో త్రిషా మరింత మెరుగైన ప్రదర్శనతో మంచి క్రికెటర్‌గా ఎదగాలని లారా ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News