Monday, December 23, 2024

మే 16న ఛలో ఇందిరా పార్క్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున దేశంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు కృతజ్ఞతగా అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్, కరపత్రాన్ని మంత్రి కోప్పుల ఈశ్వర్ శనివారం ఆవిష్కరించారు.

మినిస్టర్ క్వార్టర్స్‌లో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ గజ్జల కాకంతం, వైస్ చైర్మన్ గంధం రాములు, కోలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాద సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు జోగిన పల్లి సంతోష్ కుమార్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌ఎలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎపి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్, తదితరులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News