Monday, December 23, 2024

అణచివేతకు చెంపపెట్టు: మమత

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ప్రజలు బహుళత్వాన్ని కోరుకోవడమే ఈ ఎన్నికల ఫలితాల నైతికత అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ శనివారం నిర్ధారించారు. ప్రజలను అణచివేయడానికి ఆధిపత్యం చెలాయించే కేంద్రం వూహ్యం ఏదీ పనిచేయదని ఈ ఎన్నికలు రుజువు చేశాయని ఆమె వ్యాఖ్యానించారు. క్రూరమైన అధికారం, మెజారిటీ రాజకీయాలు తుడిచిపెట్టుకు పోయాయని ఆమె అన్నారు. మార్పుకు అనుగుణంగా విచక్ష ణమైన తీర్పుఇచ్చే ప్రజలకు వందనాలు చేశారు.

ప్రజలు బహుళ త్వం, ప్రజాస్వామ్యం శక్తులు విజయం సాధించాలని కోరుకున్నప్పు డు ఆ ప్రజల సహజత్వాన్ని ఏ కేంద్ర వ్యూహం పనిచేయదని ఈ ఎన్నికల్లో స్పష్టమైందన్నారు. ఈ నైతికత రేపటి గుణపాఠంగా వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News