హైదరాబాద్: నేడు(మే14) ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు(ప్రముఖులు) నుంచి సాధారణ జనం వరకు అందరూ తమ తల్లుల గురించి తలచుకోవడం, వారితో మధుర క్షణాలు పంచుకోవడం చేస్తున్నారు. జీవితంలో మరచిపోలేని పాత్ర పోషించిన మన అమ్మకు ప్రత్యేకంగా గౌరవం ఇచ్చే రోజు ఇది.
అన్నా జార్విన్ అనే మహిళ తన స్వంత తల్లి అలాంటి కోరికను వ్యక్తం చేసినందున ఆ రోజును జరుపుకోవాలని కోరుకున్నప్పుడు ‘ఆధునిక మదర్స్ డే’ వేడుక మొదట అమెరికాలో ప్రారంభమైందని నమ్ముతారు. జార్విన్ తన తల్లి మరణించిన మూడు సంవత్సరాల తర్వాత, 1908లో ఆమె కోసం ఒక స్మారక వేడుకను నిర్వహించారు. జార్విన్ తన తల్లిని గౌరవించిన తీరులో ఇతర దేశాలలో కూడా తల్లులను గౌరవించడం మొదలయింది. ప్రపంచంలోని ప్రతి చోట తల్లులను ప్రేమించడం, ఆదరించడం, గౌరవించడం ద్వారా ఈ మదర్స్ డే జనబాహుళ్యం అయింది.