Saturday, December 21, 2024

కరోనా కాలంలో వచ్చిన కొత్త వ్యాధి “ బ్రెయిన్ ఫాగ్ ”

- Advertisement -
- Advertisement -

కరోనా వైరస్ కాలంలో తెరపైకి వచ్చిన కొత్త వ్యాధి‘ బ్రెయిన్ ఫాగ్ ’. దీని వల్ల మెదడుకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దాడిలో ఇలాంటి అనేక వ్యాధులు నిరంతరం ప్రభావాన్ని చూపుతున్నాయి. కరోనాతో వీటికి ఎలాంటి సంబంధం లేకపోయినా, జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. దీనివల్ల జ్ఞాపకశక్తి కోల్పోతుంటారు. శ్రద్ధ లోపిస్తుంది. సమాచారాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అలసట కనిపిస్తుంది. చిన్నచిన్న విషయాలను పదేపదే మరిచిపోతుంటే , లేదా మీ స్వంత పదాలను గుర్తుంచుకోవడం కష్టంగా అనిపిస్తే దాన్ని బ్రెయిన్ ఫాగ్ అని అంటారు . ఇది సాధారణంగా అలసట, చిరాకు, బద్ధకం భావన అని పిలుస్తారు. రెండేళ్ల క్రితం సాగిన ఓ అధ్యయనం కరోనా నుండి కోలుకున్న వారిలో 28 శాతం మంది బ్రెయిన్ ఫాగింగ్, మూడ్ మార్పు, అలసట, ఏకాగ్రత లోపం వంటివి కనిపించాయని వెల్లడించింది. బ్రెయిన్ ఫాగ్ కారణంగా వ్యక్తి ప్రవర్తనలో వేగంగా మార్పు వస్తుందని ఢిల్లీ లోని వైద్యులు వెల్లడించారు.

ఇలాంటి వారిలో ఎప్పుడూ అలసట, ఏ పనిలోనైనా మనసు లగ్నం కాకపోవడం, చిరాకు, కుంగుబాటు, నచ్చిన పనిపై కూడా ఆసక్తి లోపించడం, నిత్యం తలనొప్పి, నిద్రలేక పోవడం, చిన్న విషయాలను మర్చిపోవడం, వంటి సంకేతాలు కనిపిస్తాయి. డయాబెటిస్, థైరాయిడ్ అసమతుల్యత, మూత్ర పిండాల పనితీరు సరిగ్గా లేకపోవడం, లేదా ఏదైనా ఇన్‌ఫెక్షన్ లేదా శరీరంలో పోషకాల కొరత కారణంగా కూడా బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు కనిపిస్తుంటాయి. నిద్ర లేక పోవడం, టీవీ స్క్రీన్‌తో ఎక్కువసేపు గడపడం, మల్టిపుల్ స్క్లిరోసిస్ వంటి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే సమస్యలు , శరీరం లోని అంతర్గత భాగాలలో వాపు వచ్చే అవకాశం ఉన్న వ్యాధులు, లేదా రక్తంలో చక్కెరస్థాయి పెరగడం, తగ్గడం తదితర లక్షణాలు కూడా బ్రెయిన్‌ఫాగ్‌కు కారణమవుతాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
ఆహారంలో అమైనో ఆమ్లాలు, ఎ, బి,సి విటమిన్లు, ఒమైగా 3 యాసిడ్, కొవ్వు ఆమ్లాలు, క్రమం తప్పకుండా ఉండాలి. మధ్యాహ్నం పూట కెఫిన్‌తో కూడిన పానీయాలు వాడరాదు. మద్యం, ధూమపానం విడిచిపెట్టాలి. రోజూ 12 నిమిషాల సేపు సూర్యకాంతి తీసుకొంటుండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అవసరమైతే వ్యాధి లక్షణాలను గ్రహించడానికి ఎక్స్‌రే, సిటిస్కాన్, ఎంఆర్‌టి, అలర్జీ పరీక్ష మొదలైన వాటి కోసం వైద్యులను సంప్రదించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News