Saturday, November 16, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులతో భారీగా బంగారం పట్టుబడింది. గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు ఓ ప్రయాణికుడు చిక్కాడు. వివరాల ప్రకారం ఆదివారం రియాద్ నుంచి బహ్రెయిన్ మీదుగా గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఆ సమయంలో ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతని, లగేజీ బ్యాగును స్కానింగ్ చేయడంతో బ్యాగులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికుడు బంగారం 14 బంగారం బిస్కెట్లను చార్జింగ్ బ్యాటరీలో అమర్చుకొని అక్రమంగా తరలిస్తుండగా ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి రూ. 67 లక్షల 96 వేల 133 రూపాయల విలువ జేసే ఒక కిలో 287.6 గ్రాముల 14 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకొన్నారు. ప్రయాణికుడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News