Monday, December 23, 2024

రాష్ట్రంలో సాగు భళా!

- Advertisement -
- Advertisement -

వ్యవసాయరంగంలో దూసుకుపోతున్న తెలంగాణ
పంటల ఉత్పత్తి ఉత్పాదకతలో అగ్రస్థానం
రాష్ట్ర ప్రభుత్వ కృషి భేష్
కేంద్ర మంత్రి తోమర్ ప్రశంసల జల్లు
వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు. వ్యవసాయ అభివృద్ధి కోసం వివిధ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ కృషి అమోఘమని అభినందించారు. 15-17 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న జి20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్లపై సో మవారం మాదాపూర్ హెచ్‌ఐసిసిలో కేంద్ర తోమర్ రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయరంగంలో ముం దుకుపోతున్నదన్నారు. పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలో తెలంగాణ ఎంతో ముందున్నదన్నారు. జి20 సదస్సు ద్వారా తెలంగాణతో పాటు, భారత విశిష్టతను చాటి చెప్పేందుకు కలిసి పనిచేద్దామని అన్నారు. హైదరాబాద్ చారిత్రక నగరం.

తెలంగాణ వ్యవసాయరంగంలో ముందున్న నేపథ్యంలో ఇక్కడ సదస్సు నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఆహార ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. హైదరాబాద్‌లో జి20 సదస్సును తెలంగాణ ఆహ్వానిస్తుందన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని తెలిపారు. వసతులు, విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలకడం, వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, కళలను పరిచయం చేస్తామని, ఇక్కడి చారిత్రక విశిష్టతను చాటిచెబుతామన్నారు.

హైదరాబాద్ నగరంలో సదస్సు నిర్వహించడం గర్వకారణం అన్నారు. దేశంలోని రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. పంటల మార్పిడి, వ్యవసాయంలో సాంకేతిక వినియోగంలో దేశంలోనే తెలంగాణ ముందున్నట్టు తెలిపారు. ఈ సదస్సు లోతైన చర్చలతో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణలో ఈ సదస్సు నిర్వహించడం గర్వకారణం అని, ఆహార భద్రత, వాతావరణ మార్పుల ప్రభావంపై జి20 సదస్సులో సభ్యదేశాలు ప్రముఖంగా చర్చించనున్నట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, రాష్ట్ర అడిషనల్ డీజీ అభిలాష్ బిస్త్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News